తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ మౌసుమి భట్టాచార్య జ్యుడీషియల్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అద్భుతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి నుంచి ప్రశంసలు అందుకున్న మహిళా ఎస్ఐ ఎస్.కె. రేహానా, ఆమె బృందాన్ని మల్కాజ్గిరి సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సిబ్బందిని రివార్డ్ చేసి ప్రోత్సహించారు.

