వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్పర్తి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా సెంట్రల్ జోన్ డీసీపీ (DCP) దారా కవిత గారు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న డీసీపీ గారికి పోలీసు సిబ్బంది ఘనంగా గౌరవ వందనం సమర్పించార, ఆ తర్వాత సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత గారు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీలలో డీసీపీ గారి వెంట కాజీపేట డివిజన్ ఏసీపీ (ACP) పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు మరియు హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఏ. మహేందర్ గారు పాల్గొన్నారు.
వార్షిక తనిఖీలలో భాగంగా డీసీపీ గారు పోలీస్ స్టేషన్లోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా స్టేషన్కు సంబంధించిన రికార్డులను, అలాగే సన్నిహిత వర్టికల్ కానిస్టేబుల్ గీత, కోమల, రైటర్ వర్టికల్ సుమన్, పూర్ణాచారి, సైబర్ క్రైమ్ వర్టికల్ రాజ్ కుమార్, టెక్ టీమ్ వర్టికల్ సోమన్న, కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి. రవీందర్, మరియు కోర్టు కానిస్టేబుల్ ఈ. రాజేందర్ ల పనితీరును ఆమె ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. సాంకేతికతను జోడించి నేరాల నియంత్రణలో టెక్ టీమ్ మరియు సైబర్ క్రైమ్ విభాగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
గంజాయి కేసు ఛేదించిన కానిస్టేబుళ్లకు అభినందనలు:
ఇటీవల హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసును సమర్థవంతంగా దొరకబట్టి, నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రైమ్ పార్టీ కానిస్టేబుళ్లు తిరుపతి, వెంకటస్వామి మరియు బావు సింగ్ లను డీసీపీ దారా కవిత గారు ప్రత్యేకంగా అభినందించారు. వారి ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ ఇదే తరహా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించిన అనంతరం డీసీపీ గారు సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, వర్టికల్స్ వారీగా బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని ఆమె తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో హసన్పర్తి ASI ఆర్. మల్లికార్జున్, హెడ్ కానిస్టేబుళ్లు డి. యాదగిరి, బి. లక్ష్మణ్, ఆర్. శంకర్, బి. మంజుల, క్రైమ్ పార్టీ సిబ్బంది మరియు స్టేషన్ సిబ్బంది పూర్తిగా పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
