హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్ మైదానంలో తన సత్తా చాటారు. సికింద్రాబాద్ మైదానంలో జరిగిన హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ క్లబ్ సీ-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన బ్యాట్‌తో అదరగొట్టారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఏకంగా 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలు, భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆయన కీలక ఇన్నింగ్స్‌తో సికింద్రాబాద్ క్లబ్ భారీ స్కోరు నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌పై పట్టు సాధించింది. అనంతరం ప్రత్యర్థి జట్టును నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకుని 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డీజీపీ సీవీ ఆనంద్ బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు ఆయన ఫిట్నెస్ కూడా అందరినీ ఆకట్టుకుంది. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే క్రికెట్‌పై ఆసక్తిని కొనసాగిస్తూ మైదానంలో సెంచరీ సాధించడం విశేషంగా మారింది. ఆయన 126 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజీపీ ఫిట్నెస్, బ్యాటింగ్ ప్రతిభను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
