మల్కాజిగిరి షీ టీమ్స్ ఆధ్వర్యంలో బొల్లారం, త్రిశూల్పార్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలలపై వేధింపులు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, రుణ యాప్లు, ర్యాగింగ్ నిరోధం, సీసీ కెమెరాల ప్రాధాన్యత, టీ-సేఫ్ యాప్ తదితర అంశాలపై షీ టీమ్స్ సిబ్బంది అవగాహన కల్పించారు. వివిధ సంఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, సమస్య ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించడం వంటి రక్షణ చర్యలను వివరించారు. విద్యార్థులు సైబర్ మోసాలు, వేధింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
