వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సహాయం, మోసపోయిన నగదు రికవరీ, నేరస్థుల గుర్తింపు మరియు ప్రజల్లో సైబర్ అవగాహన కల్పించడంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించిన నెలవారీ పనితీరు నివేదికలను ఇకపై ప్రతి నెలా మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
01-01-2026 నుండి 30-09-2026 వరకు:
NCRP ద్వారా మొత్తం 3,952 ఫిర్యాదులు అందగా, 1155 పరిష్కరించబడ్డాయి. 105 కేసులను గుర్తించి, 174 మంది నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాల కారణంగా బాధితులు సుమారు ₹20.66 కోట్లు నష్టపోగా ₹5.23 కోట్లు తిరిగి అందించబడ్డాయి.
Samanvaya ద్వారా 983 అభ్యర్థనల్లో 866, GRM ద్వారా 104 ఫిర్యాదుల్లో 83, MRM ద్వారా 789 అభ్యర్థనల్లో 615 పరిష్కరించి ₹21.44 లక్షలు తిరిగి అందించారు. Accused Profiling లో 116 అభ్యర్థనలు 100% పూర్తి చేశారు. జూన్, జూలై, ఆగస్టు 2026 లో 286 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 2026లో: NCRP ద్వారా 483 ఫిర్యాదుల్లో 95 పరిష్కరించి 10 FIRలు నమోదు చేశారు. MRM ద్వారా ₹50.87 లక్షలు Restorable Amount గా గుర్తించి ₹49.56 లక్షలు పునరుద్ధరించారు. 34 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 కు కాల్ చేసి National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
