వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (ఐపీఎస్) ఆదేశాల మేరకు, హన్మకొండలోని బాలసముద్రం వద్ద ఉన్న కాళోజీ కళాక్షేత్రంలో బాలికల కోసం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘షీ టీమ్స్’ (SHE Teams) ఏసీపీ సదయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బాలికల భద్రత, సైబర్ నేరాలు మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సత్య శారదతో పాటు, మనస్తత్వవేత్త డాక్టర్ బరుపాటి గోపి మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్. రాధిక పాల్గొని, బాలికలకు ధైర్యం చెబుతూ స్ఫూర్తిదాయకమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (ఐపీఎస్) బాలికలకు దిశానిర్దేశం చేస్తూ ఇలా అన్నారు: “బాలికలు తమ హక్కుల గురించి, తమకు లభించే రక్షణ మార్గాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేయకండి. ఒకవేళ మీరు సైబర్ వేధింపులకు గురైతే, భయపడకుండా వెంటనే 100 నంబర్‌కు లేదా ‘షీ టీమ్స్’ హెల్ప్‌లైన్ నంబర్ 91210 91000కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.”
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
