వరంగల్, నవంబర్ 25 : అక్రమంగా పి.డి.ఎస్. బియ్యం నిల్వ చేస్తున్నారనే పక్కా సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట-II లో ఉన్న పున్నం వేణు మాధవ్ గోడౌన్లో సోదాలు నిర్వహించారు.
ఈ దాడిలో 26 బస్తాల పి.డి.ఎస్. బియ్యం (మొత్తం 1300 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.39,000/- గా అంచనా వేశారు.
స్వాధీనం వివరాలు :
- పిడిఎస్ విరిగిన బియ్యం – 25 బస్తాలు x 50 కేజీలు = 1250 కేజీలు
- పిడిఎస్ బియ్యం- 1 బస్తా x 50 కేజీలు = 50 కేజీలు
విచారణలో నిందితుడు వరంగల్ చుట్టుపక్కల కాలనీల నుండి పి.డి.ఎస్. బియ్యం సేకరించి అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
పరారీలో ఉన్న నిందితుడు :
పున్నం వేణు మాధవ్, తండ్రి నర్సింగరావు, నివాసం ఇంటి నం. 16-1-452, ఎస్.ఆర్.ఆర్. తోట, కరీమాబాద్, వరంగల్.
ఈ దాడిలో ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, మరియు టి. వీరస్వామి మరియు టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
