మల్కాజ్గిరి: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం (05.09.2026) అంబర్‌పేట్‌లోని CAR హెడ్‌క్వార్టర్స్‌లో వారాంతపు పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌కు DCP Cyber Crimes, Malkajgiri హాజరై Parade Review Officerగా పరేడ్‌ను సమీక్షించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పరేడ్‌లో పాల్గొని, ఉన్నత ప్రమాణాలను ప్రదర్శించారు.
పరేడ్ సందర్భంగా పోలీసు సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, బృంద సమన్వయం, అప్రమత్తత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విధి నిర్వహణలో ఎదురయ్యే వివిధ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో వారాంతపు పరేడ్లు కీలకంగా నిలుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
పోలీసు సిబ్బందిలో సమయపాలన, విధి పట్ల నిబద్ధత, పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే పరేడ్ల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా సమర్థంగా స్పందించేలా సిబ్బందిని నిరంతరం సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
క్రమశిక్షణతో ముందుకు.. ప్రజల భద్రత కోసం నిరంతరం సిద్ధంగా ఉండాలనే సంకల్పంతో మల్కాజ్గిరి పోలీసులు విధులు కొనసాగిస్తున్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
