వరంగల్: ఈ నెల 10 నుండి 20వ తేదీ వరకు ఉర్సుగుట్టలోని రంగలీల మైదానంలో జరగనున్న బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఒక సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (IPS) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ: ఉత్సవాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా ప్రణాళికను సిద్ధం చేసిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా ఉన్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు మరియు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు దసరా ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
