హనుమకొండ: డ్రగ్స్ రహిత వరంగల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల నెట్వర్క్లను కూకటివేళ్లతో పెకిలించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా ఐపీఎస్ క్రైమ్ పార్టీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈరోజు హనుమకొండలోని వాగ్దేవి కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల క్రైమ్ పార్టీ సిబ్బందికి ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో విశ్వసనీయ సమాచార సేకరణ, డ్రగ్స్ సరఫరా మార్గాల గుర్తింపు, అనుమానితులపై నిరంతర నిఘా, సేకరించిన సమాచారాన్ని సకాలంలో విశ్లేషించి చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థను, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుని, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, సీసీఎస్ ఏసీపీ పి.సదయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వివిధ పోలీస్ స్టేషన్ల క్రైమ్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
