మహబూబాబాద్ : ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని చెరువుముంతు తండా, బోడమాచ తండాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 4,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు.
అనంతరం గంజాయి, సైబర్ నేరాలు, పోక్సో, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
