వరంగల్: గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ పుష్పమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజామైత్రి పోలీసింగ్ కు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ నివాళి కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు తో పాటు పలువురు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సివిల్, ఏఆర్ విభాగాల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
