హనుమకొండ: తన వృత్తి నిమిత్తం ఈరోజు హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ములుగు జిల్లా, పసరా మండలం, అమృత తండాకు చెందిన లకావత్ అరుణ్ తన లగేజ్ బ్యాగ్ మరియు ఆఫీస్ ల్యాప్‌టాప్‌ను ఆటోలో మరిచిపోయారు.
వెంటనే హనుమకొండ పోలీసులను ఆశ్రయించగా, సీఐ మచ్చా శివకుమార్ గారు వెంటనే స్పందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల ద్వారా అట్టి ఆటోను గుర్తించి, లగేజ్ బ్యాగ్ మరియు సుమారు రూ. లక్ష రూపాయలు విలువ గల ల్యాప్‌టాప్‌ను బాధితుడికి అందజేశారు.
ల్యాప్‌టాప్ తిరిగి లభించడంతో బాధితుడు లకావత్ అరుణ్ హనుమకొండ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మచ్చా శివకుమార్ గారు క్రైమ్ కానిస్టేబుల్ మహిపాల్, అశోక్ మరియు విజయకాంత్ లను అభినందించారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
