వరంగల్: నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా విక్రయిస్తున్న 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
నమ్మకమైన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం దాడి నిర్వహించగా బుక్యా దేవమ్మ వద్ద 10 లీటర్ల గుడుంబా లభించింది. దీని విలువ సుమారు రూ.4,000/- ఉంటుంది.
అదేవిధంగా పోరిక సరోజన వద్ద గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న 500 లీటర్ల ప్రైమ్ ఈస్ట్ కెమికల్ మరియు బెల్లం మిశ్రమాన్ని గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
స్వాధీనం చేసుకున్న గుడుంబాను తదుపరి చర్యల నిమిత్తం నల్లబెల్లి పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ACP ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ జి. సుబ్బా రెడ్డి, SI టి. వీరస్వామి మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
