హన్మకొండ: వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో KUC పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
KUC CI రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ మోసాలు, OTP మోసాలు, ఆన్లైన్ భద్రత, సోషల్ మీడియా జాగ్రత్తలు, సైబర్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించారు.
ఎవరికీ OTP, పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని, తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయాలని CI రవి కుమార్ విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
