హన్మకొండ: హన్మకొండ పోలీసులు ‘CEIR’ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిలో ఐదు ఫోన్లను ఈరోజు సంబంధిత యజమానులకు అందజేశారు. హన్మకొండ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఈ మొబైల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఏసీపీ నరసింహారావు, హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చా శివకుమార్, CEIR పోర్టల్ బాధ్యతలు చూస్తున్న కానిస్టేబుల్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
