వరంగల్: వరంగల్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నమ్మదగిన సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ బృందం దాడి నిర్వహించింది. ఈ దాడిలో ప్రతాప్ నగర్ కు చెందిన బక్కి సుధాకర్ (56) ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన వివిధ బ్రాండ్ల మద్యం, బీర్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు:
కె.ఎఫ్ స్ట్రాంగ్ బీర్ – 02, కె.ఎఫ్ లైట్ బీర్ – 04, బ్రీజర్ – 02, డౌన్ టౌన్ 1000 ML – 02, మెక్ డోవెల్స్ 180 ML – 02, రాయల్ స్టాగ్ 180 ML – 02, ఓ.సి. క్వీన్స్ 180 ML – 04, డౌన్ టౌన్ 180 ML – 05. వీటి మొత్తం విలువ రూ. 4,490/- గా అంచనా వేశారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న మద్యంతో సహా తదుపరి చర్యల నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్ఐ టి. వీరస్వామి మరియు టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
