హనుమకొండ: ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తిని, అతని ఇద్దరు పిల్లల ప్రాణాలను కేయూ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడి మానవత్వం చాటుకున్నారు.
కొమ్మటిపల్లి రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్-112 కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కేయూ పోలీసులు డి.వీరస్వామి, టి.తరుణ్ కుమార్, బి.హరినాథ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సోమ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పై ఉన్నట్లు గుర్తించి వెంటనే ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ధైర్యం చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని అవగాహన కల్పించారు.
ప్రస్తుతం ముగ్గురూ క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన కేయూ పోలీసులను ఉన్నతాధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
