వరంగల్: సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన, అప్రమత్తతే కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా ఐపీఎస్ అన్నారు.
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు కేయూ జంక్షన్ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ఫ్లాష్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ శ్వేతా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి నడిచారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1,200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ మెసేజ్‌లు, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యార్థులు తమకు కలిగిన అవగాహనను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుని సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు సైబర్ నేరాల నివారణపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అప్రమత్తతే సైబర్ మోసాలకు అడ్డుకట్ట అనే సందేశాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ, వరంగల్ డివిజన్ల ఇన్స్పెక్టర్లు, హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సైబర్ క్రైమ్ ఎస్ఐలు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
