వరంగల్: తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 106 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 967.864 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసింది.
ధ్వంసం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4,83,93,200 (రూ.4.83 కోట్లు) గా అధికారులు తెలిపారు.
డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ మండలం అమ్మవారిపేట గ్రామ శివారులోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్‌కు చెందిన భస్మీకరణ ప్లాంట్‌లో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిరంతరం చర్యలు చేపడుతోందని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
