వరంగల్: వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి దారా కవిత గారు కాజీపేట ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీలో కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను ఆరా తీశారు.
తదనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రమశిక్షణ, బాధ్యత, కేసుల దర్యాప్తులో నాణ్యత, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ , పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
