హైదరాబాద్: రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉప్పల్, నాగోల్, నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పడే సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ప్రత్యేకంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో ముందస్తుగా గుర్తించిన సమస్యలపై దృష్టి సారించి, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మండపాల వద్ద అగ్నిమాపక భద్రత, విద్యుత్ భద్రత, పారిశుధ్యం, CCTV నిఘా, జనసందోహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
అలాగే ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సమయంలో నిర్వాహకులు, భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన Do’s & Don’ts పై అవగాహన కల్పించారు. పోలీసులకు నిర్వాహకులు సహకరిస్తూ, భక్తి, బాధ్యత, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమష్టి సహకారంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని పోలీసులు పిలుపునిచ్చారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
