నాగోల్: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నాగోల్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్, పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, నిర్వాహకులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ, ఊరేగింపు మార్గాలు, భక్తుల రద్దీ నియంత్రణ, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా మార్గాల ఏర్పాటు, ప్రజల భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం, పోలీస్ శాఖ సూచించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. ప్రజలు, భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించి గణేష్ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
