ఉప్పల్: నమ్మకం, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా ఉప్పల్ డివిజన్ పోలీసులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీపీ ఉప్పల్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహచరీలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహచరీలు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. పోలీసులు కూడా వారితో ఆత్మీయంగా మమేకమై రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సహచరీలకు బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. పోలీసు సిబ్బంది, సహచరీల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ వేడుకలు సాగాయి. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజల భద్రతకు కట్టుబడి ఉండే పోలీసులకు కుటుంబ సభ్యుల మాదిరిగా సహచరీలు చూపించిన ఆప్యాయత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాఖీ కట్టే సంప్రదాయం ద్వారా పరస్పర విశ్వాసం, గౌరవం, సోదరభావం మరింత పెంపొందుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పోలీసు శాఖలో స్నేహపూర్వక వాతావరణంతో పాటు సమాజంతో మరింత సన్నిహిత సంబంధాలకు దోహదపడేలా నిలిచింది.
