ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేసి, మోడిఫైడ్ సైలెన్సర్లతో భారీ శబ్దాలు చేస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టారు. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
