మేడ్చల్-మల్కాజిగిరి: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన “మీ సురక్ష – సహచరి” కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల (SHG)కు చెందిన సుమారు 60 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల నివారణ, కొత్త క్రిమినల్ చట్టాలు, మహిళల భద్రతతో పాటు ‘డయల్-112’ మరియు సైబర్ హెల్ప్‌లైన్ (1930) వంటి సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ, శ్రీనిధి కళాశాల కౌన్సిలర్ రాధ, ‘షీ టీమ్’ (SHE Team) సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
