జగిత్యాల జిల్లా: -బుగ్గార మండలం కేంద్రంలో నూతనంగా వచ్చినటువంటి ఎస్సైగా గుంగంటి సతీష్ శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడతానని, అలాగే అసాంఘిక కార్యకలాపాలను అందరి సహకారంతో అరికాడుతానని అన్నారు . జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సైగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న గొంగడి సతీష్ బదిలీ కాగా మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన మాడ శ్రీధర్ రెడ్డి మేడిపల్లికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తుని పాడుచేసుకోద్దన్నారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపవద్దని చెబుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్, గంజాయి, జూదం వంటి వాటి వల్ల కఠినంగా వ్యవహరిస్తానని, ఇవి టీజింగ్ చేసే వారిపై చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన పోలీస్ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. Sai Krishna