జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని స్థానిక శుభమస్తు కన్వెన్షన్ (టౌన్ హాల్) లో ఎల్ జి రామ్ హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో అపోలో రీచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎల్ జి రామ్ హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారి ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు హెల్త్ క్యాంపు సందర్శించి సమాజానికి ఉపయోగపడే విధంగా హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఈ సొసైటీ ద్వారా చాలామంది నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్స అందించడం జరిగింది నిరుపేదలకు వైద్య సహాయం అందాలనే ఉద్దేశంతో కరీంనగర్ అపోలో రిచ్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్యుల బృందం వివిధ రకాల వైద్య సేవలు వచ్చినటువంటి ప్రజలకు ఉచిత టెస్టులు అందించి పరీక్షించడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు .ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు మాట్లాడుతూ…అందరికీ వైద్యం అందాలనే ఒక సదుద్దేశంతో పేదలకు కనీస వైద్య సదుపాయాలు అందాలని ఉద్దేశంతో, పేద ప్రజలకు మెరుగైన వైద్యము సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వచ్చినటువంటి రోగులకు ఆస్పత్రి వైద్య సిబ్బందితో తగిన పరీక్షలు చేయించి వారికి అవసరమైనటువంటి పరీక్షలు చేపించి వైద్యుల ద్వారా మందులను రాయించడం జరిగినది. గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలకు వైద్యం అందించాలని భావనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమానంతరం హాస్పిటల్ వైద్యులను, యాజమాన్యాన్ని మరియు సహకరించిన వాలంటీర్లను సొసైటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్, ఎల్.జి.రామ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి అయిల్నేని సాగర్ రావు మరియు సొసైటీ సభ్యులు,అపోలో హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు….
Our Telangana Citizen Reporter.
Mr. Mohammad. Athif.