జగిత్యాల జిల్లా: పంచాయతీరాజ్ ఉపాధ్యాయల సంక్షేమం కొరకు సామల యాదగిరి గారు స్థాపించిన పి ఆర్ టి యు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పి ఆర్ టి యు టీ ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనందరావు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు టి ఎస్ ఆవిర్భావం నుండి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు జీరో వన్ జీరో జీతాలు బదిలీలు పదోన్నతుల లో కౌన్సిలింగ్ విధానం హై స్కూల్ లలో ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పోస్టుల మంజూరి మహిళ ఉపాధ్యాయులకు మెటర్నటీ చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయించిన ఘనత పి ఆర్ టి యు దే అని వారన్నారు ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని వారు అన్నారు ఈ సందర్భంగా చాలా సంవత్సరాలు పి ఆర్ టి యు కు సేవ చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు కోగిల సత్యనారాయణ పైడిపల్లి సత్యనారాయణ రావు దండే గంగాధర్ మోర గోవర్ధన్ ల ను సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏవిఎన్ రాజు సురేఖ జమున కోగిల కృష్ణ సత్యరాజ్ రవికుమార్ మహేష్ సంధి శ్రీనివాసరెడ్డి కుంభాల శ్రీనివాస్ రెడ్డి రాజేందర్ రెడ్డి రాజేష్ రత్నాకర్ రావు దుబ్బయ్య రాజగోపాల్ వాజిద్ వసంత అనూజ చందన ప్రశాంతి శ్రీదేవి విద్యా దేవి పద్మ తరంగిణి తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.