ఖమ్మం జిల్లా: బోనకల్ గ్రామ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఏపీలోని లింగాలకు మిర్చి కోతకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యార్లగడ్డ వరమ్మ (62) అక్కడికక్కడే మృతి చెందింది. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు పెరిగే అవకాశం ఉందని సమాచారం. క్షతగాత్రులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.