జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో భరతమాత పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ ప్రముఖ్ సురేందర్ మాట్లాడుతూ దేశాన్ని తల్లిగా భావించి ఆమెకు వందనం చేయటం చాలా గర్వంగా ఉంది, ఇదే దేశం కోసం సరిహద్దుల్లో జవాన్లు తమ ప్రాణాలను అడ్డుగా నిలిపి విధులు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి భరతమాత చిత్రపటాన్ని భంకిన్ చంద్ర చటర్జీ గారు గీశారు. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను ధర్మజాగరణ ద్వారా జాగృతం చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలని వారు అన్నారు. హిందువులలో చైతన్యం నింపేందుకే గ్రామ గ్రామాన భారతమాత హారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం హిందువులు మాత్రమే దేశాన్ని తల్లిలా భావించి భారత మాతను తమ అమ్మలా కొలుస్తున్నారు ఒకవేళ భారత దేశంలో హిందువులు గనక మైనార్టీలు అయినా లేదా అధికారం హిందువుల చేయి జారినా భరతమాత కు విలువ ఉండదని అన్ని దేశల్లాగే మనది ఏదో మట్టికి ఉన్న సరిహద్దులు అన్నట్లే భావించే స్థితి వస్తుందని హెచ్చరించారు. ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గ్రామాల్లో పూజకు నోచుకోని గుడులకు కూడా యువతకు తగు శిక్షణ ఇచ్చి ధూపదీపాలు స్వామికి సమర్పించి శిక్షణ మరియు చేయూత అందించటం జరుగుతుంది తద్వారా సంస్కృతిని గుడిని రక్షించుకొని వాళ్ళం అవుతాం అని తెలిపారు.
ఇది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని కేవలం తమ మతాన్ని హిందువుల్లో అవగాహన మరియు ధర్మం పట్ల చైతన్యం కలిగించే కార్యక్రమం మాత్రమే అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో తిరుమల గంగారెడ్డి, భోగ హరి కృష్ణ, కొమురవెళ్లి శరత్, భోగ సంతోష్, పొట్టవత్తిని గంగాధర్, ఆడెపు నరేందర్, ఏనుగంటి నవీన్, బోగ గోపి , ఆడెపు మధుకృష్ణ, వంగరి రమేష్, పూదరి శ్రీనివాస్, తిరుమల శంకర్, జోగినిపెల్లి తిరుపతి గౌడ్, ఆకుల శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.