సూర్యాపేట జిల్లా: 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మద్దిరాల లో గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ బాలికల విద్యాలయంలో విద్యార్థిని వల్లపు హర్షిత తొమ్మిదో తరగతి చదువుతుంది.సంక్రాంతి సెలవులకు ఊరెళ్ళిన అనంతరం సోమవారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు తిరిగి తీసుకొచ్చారు. ఇదే గురుకుల కళాశాలలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని అక్క ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. పాఠశాలలోకి వచ్చిన అనంతరం తమ లగేజ్ బ్యాగులను గదిలో ఉంచిన అనంతరం విద్యార్థిని వల్లపు హర్షిత నేరుగా డార్మెటరీ కి వెళ్లి చున్నీతో ఉరివేసుకున్నట్టు తమకు ఇద్దరు విద్యార్థులు సమాచారం ఇచ్చారని ప్రిన్సిపల్ విలేకరులకు వివరించారు. ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. పట్టణ సీఐ వీర రాఘవులు ఆసుపత్రి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని స్వగ్రామం చివ్వెంల మండలం బీబీ గూడెం. బీబీ గూడెం గ్రామానికి చెందిన వల్లపు సైదులు రెండో కుమార్తె హర్షిత. డాక్టర్ చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించి విద్యార్థిని హర్షితను పరామర్శించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.