జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల అర్బన్ , రూరల్ మండలం , సారంగపూర్ , బీర్పూర్ , రాయికల్ మండలాల సీఎం సహాయ నిధి 1 కోటి 85 లక్షల 20 వేల రూపాయల చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన నడిచిందికాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు మిన్నగా మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం గతంలో అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ వాటికి అదనంగా ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రాథమిక హక్కులలో భాగంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యతవైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వపరంగా అవకాశాలు ఏ మేరకు ఉన్న వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వపరంగా పొందలేని సమయంలో ప్రైవేట్ హాస్పిటల్ లో ఆశ్రయించడం సహజంప్రభుత్వ పరంగా ఆరోగ్య శ్రీ లో జరిగే వైద్య సదుపాయాలను వినియోగించుకివాలి సీఎం సహాయనిది ద్వారా కొంత మాత్రమే మనకు లబ్ది చేకూరుస్తుంది కానీ ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తిగా వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారుకాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వివరించారు1 తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమమే ద్యేయంగా ఉచిత బస్ రవాణా సౌకర్యం2 నిరుపేదలు అయిన దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అల్పసంఖ్య వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్య సదుపాయం అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు 80 శాతం ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతున్నారు అని అన్నారు3 రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ 85 శాతం జరిగింది అన్నారుఇంకో 25 శాతం మిగిలి ఉంది అని అన్నారు 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి ఉంది కాని నిధుల కొరతతో మాత్రమే జాప్యం అవుతుంది అని అన్నారుగతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ వడ్డీ మాఫీ గాని మిగిలిపోయిందిదశలవారీగా ఇవ్వడంతో ఆ డబ్బులు వడ్డీకి పోయాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంగా రుణమాఫీ చేసిందని అన్నారుబిజెపి ప్రభుత్వానికి అసలు రుణమాఫీ ఆలోచననే లేదని అన్నారుపెట్టుబడి దారులకు మాత్రమే బీజేపీ లక్షల కోట్ల అప్పుల రుణాన్ని బ్యాంకుల ద్వారా మాఫీ చేస్తుంది కానీ రైతులకు రుణమాఫీ చేసే ఆలోచన లేదు అని అన్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడకుండా అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ గారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేశారని అన్నారుకేంద్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తే 2 లక్షల పైన ఉన్న వారు కూడా రుణమాఫీ చేయవచ్చని అన్నారుకేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణమాఫీ చేయడానికి సహాయం వారి బాధ్యతగా సహాయం అందించాలని అన్నారుగ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారుగతంలో ఆరోగ్య శ్రీ 5 లక్షలు ఉన్న పరిమితి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది 10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారురేషన్ కార్డుల జాబితాలో పేరు రానివారు ఆందోళన చెందవద్దని రేషన్ కార్డ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు21వ తేదీ నుండి గ్రామసభ వార్డు సభలలో పేరు నాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని అన్నారుగత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారుఅర్హత కలిగిన వారందరికీ గృహ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారునియోజకవర్గానికి 3500 ఇండ్లు పంపిణీకి ప్రభుత్వ స్వీకారం చుట్టిందని పూర్తిగా ఇల్లు లేని వారు వికలాంగులు ఒంటరి మహిళలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారుగత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ అని ఎంతమందికి ఇచ్చిందో తెలియదు కానీ గ్రామాలలో వెళ్తే ఇందిరమ్మ గృహ సదుపాయాలు మాత్రమే కనిపిస్తాయని అన్నారుపార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితం పొందలేకపోయినా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గల్ఫ్ లో అకాల మరణం పొందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల సహాయం అందే విధంగా కార్యక్రమాన్ని అమలు జరిగే విధంగా చేయగలిగాను అని అన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.