మహబూబాబాద్ జిల్లా : శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసిన కుటుంబసభ్యులు. ఈ సంఘటన చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది.మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు. విషయం స్థానికులకు తెలవడం తో చుట్టుపక్కల వాళ్ళు అంత కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా.. బయటపడిన మృతదేహం.ఇంటికి తాళం వేసి పరారైన మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడుచు వారికోసం వెతుకుతున్న పోలీసులు.కాటి లక్ష్మి అత్త, కాటి రాములు మామ, దుర్గ ఆడపడుచు, ఆడపడుచు భర్త మహేందర్, చనిపోయిన మహిళ భర్త పేరు గోపి. చనిపోయిన మహిళ పేరు నాగమణి(35) ఆమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.