జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్క పేట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీ మరియు వైకుంఠధామంను కలెక్టర్ పరిశీలించారు. వైకుంఠధామం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని పూల మొక్కలను పెట్టాలని సూచించారు.
అలాగే డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్ పరిశీలించి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో పలు వార్డు లో ఇళ్లులేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలను గుర్తించి మంజూరు చేస్తాము అన్నారు. దగ్గర ఉండి వివరాలను నమోదు చేపించి త్వరితగతిన సర్వేని పూర్తి చేయాలని తెలిపారు . కలెక్టర్ వెంట, ఆర్డీవో, శ్రీనివాస్ డిపిఓ, రఘు వరుణ్ , ఎమ్మార్వో, ఎంపీడీవో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.