జనగామ నియోజవర్గం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్లనాగుల శ్వేత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఇటీవలే నల్లనాగుల శ్వేత మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించింది ఇంతలోనే ఇలా జరగటం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది.కేవలం కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్య హత్నానికి పాల్పడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వృత్తి పరంగా లేదా మరే ఇతర శత్రువులు లేరని కూడా సమాచారం.విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు, వైద్యులు చెప్పిన వివరం ప్రకారం ఆమె ప్రస్తుతం కోలుకుంటుందని, ఆరోగ్యంగానే ఉందని సమాచారం.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.