జగిత్యాల జిల్లా: బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి – అవక తవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి – వ్యక్తిగతంగా పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కు తెలంగాణ లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు ఆదేశాలు జారీ చేశారు.అట్టి తీర్పు ప్రతులు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందినట్లు మంగళ వారం ఆయన విలేఖరులకు తెలిపారు.తప్పుడు/ దొంగ ఎంబి లు, ఇతర దొంగ రికార్డులు, దొంగ బిల్లులు సృష్టించి బుగ్గారం గ్రామ పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం చేశారని, ఇందుకు కొందరు అధికారులు కూడా సహకరించారని గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ ఉద్యమకారుడు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి విడిసి ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి అప్పటి జిల్లా కలెక్టర్ ల వరకు అనేక మార్లు పిర్యాదులు చేశారు. నిధుల దుర్వినియోగం పై మూడు సార్లు విచారణ చేపట్టి కూడా జిల్లా కలెక్టర్ తో సహా సంబంధిత అధికారులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని చుక్క గంగారెడ్డి ఆరోపించారుజిల్లా స్థాయి అధికారులు కూడా అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చట్టాలను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ తీర్పులను సైతం బే ఖాతరు చేశారని, దోషులపై చర్యలు తీసుకోవడం లేదని, జిల్లా స్థాయి అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అప్పటి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులపై తగు ఆధారాలతో సహా “తెలంగాణ లోకాయుక్త” కు చుక్క గంగారెడ్డి 2022 సెప్టెంబర్ లో పిర్యాదు చేశారు. ఆయన పిర్యాదులు, ఆధారాలు, జిల్లా పంచాయతీ అధికారులు లోకాయుక్త కు అందజేసిన వివరణ లను పరిశీలించి డిసెంబర్ 6న తెలంగాణ లోకాయుక్త జస్టిస్ (న్యాయమూర్తి) సి.వి.రాములు తుది విచారణ జరిపి తీర్పు జారీ చేశారు. బుగ్గారం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి, అవక తవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నిధుల దుర్వినియోగాన్ని వ్యక్తి గతంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ లోకాయుక్త తీర్పులో పేర్కొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar