కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీస్ కరీంనగర్ కమిషనరేట్ భరోసా కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.ఐ.జి రమా రాజేశ్వరి, ట్రైనీ ఐపీస్ యాదవ్ వసుందర, అడిషనల్ డీసీపీ లక్ష్మీ నారాయణ, సీజీమ్ ఎస్‌బిఐ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ గారు మాట్లాడుతూ, భరోసా కేంద్రం మహిళల భద్రతకు, సంక్షేమానికి కీలకంగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఈ కేంద్రం ద్వారా తక్షణ సహాయం అందించబడుతుందని ఆయన అన్నారు.ఉమెన్ సేఫ్టీ వింగ్ డి.ఐ.జి రమా రాజేశ్వరి గారు మాట్లాడుతూ, భరోసా కేంద్రం మహిళలకు న్యాయం చేయడంలో, వారి హక్కులను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అధికారులు కూడా భరోసా కేంద్రం ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా, డీజీపీ జితేందర్ గారు మరియు ఇతర అధికారులు భరోసా కేంద్రం సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Our Telangana Citizen Reporter.
Mr. Rakesh Gandhe.