వికారాబాద్ జిల్లా: కొత్త సంవత్సరం వేడుకల కోసం కొందరు వ్యక్తులు గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను తీసుక వెలుతున్నారనే సమాచారం మేరకు వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు వాస్కోడిగామా రైల్లో శనివారం తెల్లవారు జామున దాడులు నిర్వహించి 95 మద్యం బాటిళ్లను స్వాధీనంచేసుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు రానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం మద్యం కొనుగోలుకు గోవా వెళ్లారు. తిరుగు ప్రయాణం లో గోవాలో మద్యం కొనుగోలు చేసుకొని వాస్కోడిగామా రైల్లో హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రంగారెడ్డి డివిజన్‌లోని వికారాబాద్ ఎక్సైజ్ ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్, డి టి ఎఫ్,ఎక్సైజ్ ఎస్సైలు ప్రేమ్‌రెడ్డి, వీరాంజనేయులు సిబ్బంది రైల్లో తనిఖీలు చేపట్టారు.రైల్లోలోని నాలుగు బోగీల్లో దాడులు నిర్వహించి రూ. లక్ష విలువ చేసే 95 మద్యం విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.