హైదరాబాద్: లోని ఎల్బి స్టేడియం వద్ద మాజీ హోం గార్డు టవర్ ఎక్కిన ఘటన చోటు చేసుకుంది.సమైఖ్య రాష్ట్రంలో హోం గార్డు గా విధులు నిర్వహించే దాదాపు 250 మంది హోం గార్డు లు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందుకు ప్రతిగా కక్ష్య గట్టిన నాటి ప్రభుత్వం వారిని భేషరతుగా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండా విధుల నుండి తొలగించి తమ పట్ల అన్యాయం చేసిందని వీరాంజనేయులు పేర్కొన్నాడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తమ ఉద్యోగాలు మళ్ళీ ఇప్పిస్తామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కారుల కేసులు ఎత్తివేస్తము అని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయలేదని వాపోయాడు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం చర్చించి హోం గార్డులకు న్యాయం చేయాలని వీరాంజనేయులు విన్నవించారు.
Our Telangana Citizen Reporter.
Mr. A.Naveen Kumar.