
రంగారెడ్డి జిల్లా : 2024లో కూడా ప్రజలు కులం అనే మహమ్మారికి బలి అవుతున్నారు. చదువుకొని ఉద్యోగం చేస్తున్న మహిళా కులం తక్కువ అబ్బాయిని వివాహం ఆడిందని సొంత కుటుంబ సభ్యుడే హతమార్చాడు. ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడు రమేష్ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది.నాగమణి కులాంతర వివాహం చేసుకుందని దాని ద్వారా తమ కుటుంబ పరువూ పోయిందని భావించిన తమ్ముడు కక్ష్య పెంచుకున్నాడు. అందుకు పక్క ప్రణాళిక రచించిన తమ్ముడు బైక్ పై వెళ్తున్న నాగమణి ని కార్ తో గుద్ధి, రోడ్డు పై పడి ఉన్న ఆమెను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. దాంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.