
జగిత్యాల జిల్లా: బీర్పూర్ మండలం లోని బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమాన్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.విగ్రహం విరిగిపోయిన తీరు చూస్తేనే అది కక్షపూరితంగా చేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా విగ్రహాల ధ్వంసం అనేది జరుగుతూనే ఉంది. అధికార పార్టీ గాని సంబధిత వ్యక్తులు గాని దానిపై కఠిన చర్యలు తీసుకోక పోవడం హిందువులు ఆందోళన చెందుతున్నారు. కేవలం హిందూ విగ్రహాలే టార్గెట్ గా ఈ విధ్వంసం జరుగుతున్నట్టు వరుస సంఘటనల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు.ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసు వారితో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ జగిత్యాల జిల్లా ఇన్చార్జి డాక్టర్ బోగ శ్రావణి గారు ఎస్ఐ కి తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A. Naveen Kumar.