ధర్మపురి: సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ కనీసం ధర్మపురి అభివృద్ధి గురించి ఆలోచించింది లేదని,ధర్మపురినీ రెవెన్యూ డివిజన్,నైట్ కాలేజ్ ప్రారంభించడం వంటివి చేస్తారని అనుకున్నామని కానీ అది సాధ్యపడలేదని,గోదావరి తలాపున ఉంటుంది కానీ ప్రజలకు కనీసం త్రాగు నీటి కష్టాలను దూరం చేయలేకపోయారని,ప్రజలకు హాని చేసే ఇథనాల్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తే దానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి మేము పోరాటం చేస్తే మాపైన అక్రమ కేసులు నమోదుచేయడం జరిగిందని,నైట్ కాలేజ్ ని తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని చాలా మంది అన్నప్పటికి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ అధికారులతో,మరియు ఎండోమెంట్ మంత్రి మరియు అధికారులతో మాట్లాడి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరిగిందని,ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే సిబ్బంది నియామకం జరిగిందని,స్వయంగా నా ACDP నిధుల నుండే 5 లక్షల రూపాయలను కళాశాల మరమ్మతులకు కేటాయించడం జరిగిందనీ, ఇంటిగ్రేటెడ్ వసతి గృహానికి ఇప్పటికే 25 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందనీ త్వరలోనే దానికి శంకుస్థాపన చేస్తామని,నైట్ కాలేజ్ పునః ప్రారంభించడంలో సహకరించిన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, MLC జీవన్ రెడ్డి గారికి,కొండ సురేఖ గారికి,పొన్నం ప్రభాకర్ గారికి,అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామనీ ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.