జగిత్యాల: వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు మెట్ పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ , క్రైం రికార్డు , ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.సర్కిల్ పరిదిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసులలో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, పరిశీలించారు. గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. SOP ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, 5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు.సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్సై ల ద్వారా చర్యలు చేపట్టాలని సి. ఐ నిరంజన్ రెడ్డి కి సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయాలని, సిబ్బంది పనితీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలనీ సూచించారు. సర్కిల్ పరిదిలోని రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసులలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ప్రజలకు సైబర్ నేరాలు వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా సి సి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామాల్లో తెలియజేస్తూ ప్రతి గ్రామoలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ6 సందర్భంగా మెట్ ప;ల్లి సర్కిల్ ఆవరణలో ఎస్పీ గారు మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉమా మహేశ్వర రావు ,DCRB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మెట్ పల్లి సి .ఐ నిరంజన్ రెడ్డి ఎస్సై లు చిరంజీవి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Mobile Reporter.
Mr. Vemula Sai Krishna