జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.
పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభా.
జగిత్యాల జిల్లా:-తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలుఅంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రవీంద్ర కుమార్, రఘు చందర్, A.O శశి కళ, ఇన్స్పెక్టర్లు వేణు గోపాల్ , కృష్ణ రెడ్డి , ,RI లు కిరణ్, రామక్రిష్ణ, వేణు మరియు ఎస్.ఐ లు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Chippa Shivakumar