జగిత్యాల జిల్లా:- జగిత్యాల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యక్రమంలో సోమవారం జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు, విరా మన పొందుతున్న ఏ.ఎస్.ఐ వాలి బెగ్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య ను సత్కరించారు. ఎస్పీ గారు మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలుతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందంజు ఉండి ప్రజలకు సేవలు అందించడం గర్వకారణం అన్నారు. మీరు చేసినటువంటి సేవలు భవిష్యత్తు తరాల వారికి ఎంతో స్ఫూర్తి కరంగా ఉంటాయని చెప్పారు. మీరు ఎల్లవేళలా మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఏ ఉద్యోగంలోనైనా జీవితంలో పదవి విరమణ అనేది కచ్చితంగా ఉంటుంది అని అన్నారు. అనంతరం పదవి విరమణ చెందినటువంటి అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించుకొని బ్యాండ్‌తో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ భీమ్రావు రిసర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ వేణు సి సి ఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. Rakesh Gandhe.