– – – డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి.
– – – సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– – – పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు.
జగిత్యాల జిల్లా :- ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈరోజు ఆకస్మికంగా పేగడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి నివారణ పై ప్రత్యేక దృష్టి సారించి సరఫరా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.ఎస్పీ గారి వెంట మల్యాల సీఐ రవి ఎస్ఐ రవికిరణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizens Reporter.
Mr. Shivacharan Chippa.