జగిత్యాల: రాయికల్ మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎస్పి .
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాభావ పరిస్థితులను దృష్ఠిలో ఉంచుకొని జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాయికల్ మండలంలోని జగన్నాథపుర్, నాయకపోడు గ్రామం మరియు బోర్నపల్లి బ్రిడ్జి, గ్రామాలను సందర్శించి, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోదావరి నది మరియు కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పుడు పోలీస్ శాఖ తరుపున ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటామని గ్రామస్థుల రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్థులకు భరోసా కల్పించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు,కాలువలు,కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.
ఎస్పీ గారి వెంట SB ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, రాయికల్ ఎస్సై అశోక్ ఉన్నారు.
Our Telangana Citizens Reporter.
Chippa Shivacharan.