జగిత్యాల : ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఈ సంవత్సరం గడిచిన 6 నెలలో అన్ని పోలీస్ స్టేషన్లు మరియు ఇతర కార్యాలయాల పనితీరుపై, నమోదైన కేసుల పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన ఆరు నెలల్లో పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును, కేసుల చెదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్చయతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పి లు, సి. ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేసి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత లక్ష్యంగా పనిచేసే చేయాలని మహిళలు చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన , ఎలాంటి దాడులకు పాల్పడిన వారిపై చట్టపరం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ ల వారిగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు.ఈ యొక్క సమావేశంలో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్ , భీమ్ రావు ,డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, రంగా రెడ్డి మరియు DCRB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,సురేష్ ,నిరంజన్ రెడ్డి, మరియు ఎస్.ఐ లు,DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter.
Md. Abdul.