జబితాపూర్ (జగిత్యాల్):-జులై 7 జగిత్యాల జిల్లా జాబితాపూర్ నివాసి అయిన ఏగులపు జగదీష్ S/O ఏగులపు రాజు(ఒక ఆటో డ్రైవర్) జగదీష్ కి కాలర్ ఎముక ప్రమాదవశాత్తు క్రింద పడడం వల్ల విరిగింది. దీని కోసం హాస్పిటల్ కి తేదీ ఏప్రిల్ 15 రోజున , ఓం శ్రీ సాయి హాస్పిటల్ నందు చికిత్స కోసం వెళ్లారు. అప్పుడు ఏముకు విరిగింది అని, Dr ఏమ్ ఫణీంద్ర కుమార్ గోల్డ్ మెడలిస్ట్ (Regd No 53516 )చెప్పాడు .ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పడం తో రాడ్ కూడా వేయాలని సూచించాడు . తదనంతర క్వాలిటీ రాడ్ వేస్తాము అని చెప్పి ,నాసిరకం రాడ్ వేసి ఆపరేషన్ చేశారు. పేషంట్ జగదీష్ కి వేసిన రాడ్ వేరు ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చిన రాడ్ వేరుగా ఉంది . దాంతో పేషంట్ కి ఇన్ఫెక్షన్ జరిగింది. నాసి రకం రాడ్ వేసి ఆపరేషన్ చేసి చేతులు దులుపుకున్న డాక్టర్ ఏమ్ ఫణీంద్ర కుమార్ . పేషంట్ కి ఇన్సూరెన్స్ పాలసీ ఉందని తెలిసి కూడా, డాక్టర్ ఎం. ఫణీంద్ర కుమార్ డబ్బులు అడిగారు. డాక్టర్ ఎం ప్రణీంద్ర కుమార్ అజాగ్రత్త వల్ల ఇప్పుడు పేషంట్ కి ఇన్ఫెక్షన్ జరిగింది .పైన తెలిపిన విధంగా రెండు సార్లు ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ నీ నిలదీస్తే మిరేవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని , పేషంట్ కుటుంబీకులను బేధిరిస్తున్న డాక్టర్ ఎం ఫణీంద్ర కుమార్ .ఇన్సూరెన్స్ ఉన్న కూడా చికిత్స ఈ విధంగా చేసి చేయి దులుపుంటున్న డాక్టర్ ఎం.ప్రణీంద్ర కుమార్ .ఇతనిపై తగిన చర్య తీస్కో వాలని కోరుతున్న పేషంట్ తండ్రి అయిన రాజు మండిపడుతున్నాడు.మాకు న్యాయం జరగాలి అని రాజు కుటుంబీకులు వేడుకుంటున్నారు.
Our Citizen Reporter from Jagtial District
MOHAMMED ABDUL ATHIF